బోర్‌వెల్ రీఛార్జ్ ఫిట్ పనులకు శ్రీకారం

మాలపల్లి, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 9:
మాలపల్లి గ్రామంలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో బోర్‌వెల్ రీఛార్జ్ ఫిట్ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత–రాజు బుధవారం శ్రీకారం చుట్టారు. బోర్‌వెల్ రీఛార్జ్ ఫిట్ కోసం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ స్వర్ణలత మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే పలు గ్రామాల్లో నీటి కొరత ఏర్పడుతోందని అన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు గ్రామంలో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ ఫిట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి నిల్వలను పెంచే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సహకారంతో గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో గ్రామంలోని బావుల్లో పూడికతీత పనులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బావులు తవ్వించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో APO పద్మ, EC పరశురాములు, TA భాస్కర్, పంచాయతీ కార్యదర్శి దివ్య, వార్డు సభ్యుడు బత్తుల వీరస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ భక్తుల రేణుక తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :