

వక్తలు మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రైతులకు ధైర్యం నింపిన మహానేత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి తరానికి ఆమె జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.






