

రైతులకు 18 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నవీపేట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరంగా అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, సీనియర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వీడి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు.







