రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

రామవరం: తెలుగు కే న్యూస్ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు నమోదు) చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత సూచించారు. రామవరం క్లస్టర్ పరిధిలోని రైతులకు రైతు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ వ్యవసాయ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన రైతులకు సకాలంలో అందించేందుకు రైతు నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు తమ భూమి వివరాలు, ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో సమీపంలోని రైతు వేదికలో నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.రైతు నమోదుతో భూమి, పంటల సాగు తదితర వివరాలు అధికారికంగా నమోదు అవుతాయని, తద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతు నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :