ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన

నిజామాబాద్ జిల్లా,నవీపేట్: నిజాంపూర్, లింగాపూర్, బినోలా గ్రామాల పరిధిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంపులు పనిచేయకపోవడంతో సుమారు 100 ఎకరాల మేర పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం బీఆర్‌ఎస్‌ నవీపేట్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లి, లిఫ్ట్‌ పంపులను వెంటనే మరమ్మతు చేయించి సాగునీరు అందించాలని కోరారు.
బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. లిఫ్ట్‌ పంపులను సకాలంలో మరమ్మతు చేయకపోవడం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వి. నర్సింగ్‌రావు, సొసైటీ చైర్మన్‌ న్యాలకంటి అబ్బన్న, తెడ్డు పోశెట్టి, బినోలా సొసైటీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌ నాళేశ్వర్, సర్పంచ్‌ ఆర్మూర్‌ లావణ్య శ్రీనివాస్, అభంగపట్నం సర్పంచ్‌ గైని వసంత సతీష్, సీనియర్‌ నాయకులు బెల్లల్‌ నర్సింగ్‌రావు, తుంగిని మాజీ సర్పంచ్‌ రవీందర్‌రావు, నిజాంపూర్‌ మాజీ సర్పంచ్‌ రమేష్, నాళేశ్వర్‌ మాజీ ఉపసర్పంచ్‌ లక్ష్మణ్, నాయకులు బొర్ర సురేష్, డాంగే శ్రీకాంత్, శ్రవణ్, టేకు పోశెట్టి, శ్యామ్, నయీమ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
రైతుల పంటలను కాపాడేందుకు లిఫ్ట్‌ పంపులను వెంటనే మరమ్మతు చేసి సాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.