కామారెడ్డి పట్టణం లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ

కామారెడ్డి అక్టోబర్1:k24 న్యూస్ తెలుగు: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా కామారెడ్డిలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు ఇన్‌చార్జ్ వేణు మాధవ్ హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా పండుగ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా, షేక్ సన, ఏసు, మాజీ సర్పంచ్ పెరుమాండ్ల రాములు, దేవేందర్ గౌడ్, రాజు, దోమకొండ దుంపటి రాకేష్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ హాజరుతో జెండా పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :