రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికి సమానంగా అందాలి? ఎమ్మార్పీఎస్ నేత ఎంపీ ప్రకాష్

కె24న్యూస్ తెలుగు జూలై 31. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జరుగు పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా అందేలా చూడటమే అని అన్నారు. ఎస్టీ కుటుంబాలు మూఢనమ్మకాలను విడిచిపెట్టి, సమాజంతో కలిసిమెలిసి జీవించాలని, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం గ్రామ ప్రధాన ప్రాంతాల్లో నివసించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో అందరితో సమానంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు.ఎస్టీ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, నివాసానికి అనువైన ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన జీవన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వారికి అవసరమైన అన్ని సంక్షేమ సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయన ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, వ్యవసాయ శాఖ (ఏఈ), విద్యాశాఖ, హౌసింగ్ శాఖ, పంచాయతీ కార్యదర్శి మరియు విఆర్ఓ పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.