

కె24న్యూస్ తెలుగు జూలై 31. తాడేపల్లిలోని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ డా!!ఉండవల్లి శ్రీదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన కుప్పం ఎమ్మార్పీఎస్ నేతలు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆమెను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యలు, సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజలకు న్యాయం జరిగేలా సహకరించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లినట్లు అయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కుప్పం నియోజకవర్గ కో ఇంచార్జ్ పి.వెంకటేష్, రామకుప్పం మండల ఇంచార్జ్ గోవిందప్ప,మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు జయప్ప, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.






