అనుమతి లేకుండా మద్యం విక్రయం.. కేసు నమోదు

కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు:
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీలోని హోటళ్లు, మెస్‌లపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్‌లో అనుమతి లేకుండా మద్యం విక్రయించి, సేవించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకుడు లింబయోల దిలీప్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. హోటళ్లు, మెస్‌లు, దాబాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు లేదా సేవకు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై విక్రంకుమార్‌తో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.