
కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 7
- కరీంనగర్ నగరపాలక సంస్థ 6వ డివిజన్ తోట కిరణ్ ప్రజావాణి దరఖాస్తు ఇవ్వడం జరిగింది బొమ్మకల్ గుంటూరు పల్లి లో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో పారిశుధ్యం రోజు వారీగా కాకుండా వారంలో ఒక రోజు మాత్రమే చేయడం జరుగుతుంది. దీని వలన దుర్వాసన రావడమే కాకుండా దోమలు, ఈగలు ఎక్కువగా తయారై రోగాల బారిన పడుతున్నారు తాగునీటి సరఫరా వారంలో రెండు రోజులు మాత్రమే అది కూడా 10 నుండి 15 నిమిషాలు రావడం ద్వారా తాగునీటికి ఇబ్బంది అవుతుంది అనేక కరెంట్ స్తంభాలకు వీధి లైట్లు రావడం లేదు, రానున్న వినాయక చవితి సందర్భంగా వీధి లైట్లు ఏర్పాటు చేయగలరు మా యొక్క డివిజన్ లోని మల్లయ్య చెరువు లోకి బైపాస్ ప్రాంతంలోని మురికి నీరు చేరడం ద్వారా చెరువు నీరు అన్ని కలుషితం అయి వాసన రావడం కాకుండా పంట పొలాలకు కూడా ఇబ్బంది అవుతుంది, వాటిని చెరువులో కలవకుండా మోరిల ద్వారా వెళ్లేటట్టు ఏర్పాటు చేయగలరు డివిజన్ లో పందులు మరియు కుక్కలు అధిక సంఖ్యలో ఉండడం వలన పిల్లలకు మరియు వార్డు ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది డివిజన్ లో అనేక మందికి వృద్ధాప్య మరియు వికలాంగుల మరియు ఒంటరి మహిళల చాలా మందికి ఫించన్లు రావడం లేదు, దీనిపై అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చిన ప్రయోజనం లేదు. కావున వెంటనే వారికి ఫించన్లు వచ్చేటట్లు చేయగలరు డివిజన్ లో అనేక మందికి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనప్పటికి ఇప్పటి వరకు జాబితాలో పేర్లు రాలేదు. కావున దీనిపై విచారణ జరిపి అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరు గతంలో గ్రామ పంచాయితీ ఉన్నప్పుడు 600 కు పైగా ఇంటి పరిష్కార్లు ఉన్నప్పటికి ప్రస్తుతం మున్సిపాలిటీలో ఆన్లైన్ లో చూపించడం లేదు, దీనిపై వెంటనే విచారణ జరిపి ఆన్లైన్ లో వచ్చేటట్లు చేయగలరు. కొనడానికి, అమ్మడానికి మరియు కోర్టు జమానత్ కు ఇబ్బంది కలుగుతుంది అని ప్రజావాణి తోట కిరణ్ కుమార్ కోరారు






