మద్దేపల్లిలో ప్రకృతి అందం.. ఆకట్టుకుంటున్న గుట్ట జలపాతం

నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలం:- మద్దేపల్లి గ్రామ శివారులో కురిసిన భారీ వర్షాలకు గుట్ట ప్రాంతంలో ఏర్పడిన సహజ జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొండపై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తున్న నీటి ధారలను తిలకించేందుకు గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
వర్షాల కారణంగా ప్రకృతి అందాలు మరింత సోయగం సంతరించుకోవడంతో యువత, ప్రకృతి ప్రేమికులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. ఈ జలపాతం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, వాగులు నిండుకుండలా మారడంతో రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి వర్షాలు కొనసాగితే సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :