సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్

జూలై 26: భైంసా నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నం. TS 18 T 7521 ఫకీరాబాద్ మార్గమధ్యంలో వెళ్తుండగా డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడిపినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను గమనించిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే బస్సు నడపడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ప్రయాణికులు పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ఫోన్ వినియోగం రహదారి భద్రతా నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :