
పెరుకలగడ్డ, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 5:
వింజపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి దంపతుల కుమార్తె స్వర్గీయ బద్దం కావ్య పుట్టినరోజు సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం పెరుకలగడ్డ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టేషనరీ, తినుబండారాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో మినీ RO వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి అందజేస్తామని బద్దం తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు దాతృత్వాన్ని ప్రకటించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవా కార్యక్రమం చేపట్టడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమానికి గౌరవ సర్పంచ్ శ్రీజ–జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
స్వర్గీయ బద్దం కావ్య జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించిన తిరుపతిరెడ్డి దంపతులకు, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న సర్పంచ్ శ్రీజ–జీవన్‌రెడ్డికి పాఠశాల తరఫున ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు






