చొప్పదండి నియోజకవర్గం. రామడుగు మండలంలో బారీ మట్టి దోపిడీ

వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి అధికారులతో కుమ్మక్కై అనుమతులకు మించి అక్రమ తవ్వకాలు వాణిజ్య అవసరాలకు ఇటుక బట్టీలకు యేథేచ్ఛగా తరలింపుపై కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు ఆర్.పి.ఐ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ పిర్యాదు చేసారు. రామడుగు మండలంలో కొందరు కాంట్రాక్టర్లు, వ్యక్తులు.
ఇరి గేషన్ అధికారులతో కుమ్మక్కె నిబంధనలకు విరుద్ధంగా వేలాది క్యూబిక్ మీటర్ల (టన్నుల ) చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్.పి.ఐ)
రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, మరియు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ కి అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా కుతాడి శివరాజ్ మాట్లాడుతూ.
చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు మండలం పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సీనరేజ్ సీనరేజ్ (రాయల్టీ) నిధులను ఎగ్గొట్టి, అనుమతించిన పరిమాణం కంటే అదనంగా వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తోడుతున్నారని ఆరోపించారు. స్థానిక అవసరాలకు లేదా ప్రభుత్వ పనుల కోసం కాకుండా, భారీ లాభాల కోసం జిల్లా ఉన్న ఇటుక బటిలకు అక్రమ మట్టిని చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలకు యథేచ్ఛగా అమ్ముకుంటూ సొమ్ము చేసు కుంటున్నారని మండిపడ్డారు. బాధ్యత గల అధికారులు ఈ దోపి డీని చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్నారు. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం- వాల్టా చట్టం ఉల్లంఘన. మట్టి తవ్వకాల ముసుగులో ఎలాంటి వాల్యూయేషన్ లేదా అటవీ, ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా వేలాది చెట్లను అడ్డగోలుగా నరికివేశారని కుతాడి శివరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని, తెలంగాణ ప్రభుత్వ సత్వ ‘వాల్టా’ చట్టాన్ని ఇక్కడ పూర్తిగా ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల స్థానిక నీటిపారుదల వనరులు, కాలువలు.విలువైన రోడ్లు. ఇల్లు పగుళ్లు వస్తోంది అని. అంతేకాదు వాతావరణం కూడా దెబ్బతినడమే కాకుండా భూగర్భజల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అక్రమంగా చెరువులోని మట్టిని తరలిస్తున్న మట్టి మాఫియా కాంటాక్ట్ రు పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసి సాగుతున్న ఈ అక్రమ మట్టి దందాపై, చెట్ల నరికివేతపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగాం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జైలుకు తరలించారుని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రావలసిన రాయల్టీ సొమ్మును వడ్డీతో సహా రికవరీ చేయాలని కుతాడి శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులు, ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.