
కె24న్యూస్ తెలుగు (గంగాధరనెల్లూరు నియోజకవర్గం) జూన్ 11. పెనుమూరు మండలంలోని పులిగుండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఈనెల15న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా పర్యాటక మండలి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 7గంటల నుండి 8గంటల వరకు యోగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


