సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను, స్టేజీ, గ్యాలరీలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు శ్రీధర్ బాబు, కె ఎస్ బి కుమారి, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, ఆర్&బి ఈఈ బీమ్లా నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, తదితరులు ఉన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.