భాజయుమో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా భాను గౌడ్

నిజామాబాద్ జిల్లా,నవీపేట: భారతీయ జనతా యువమోర్చా (భాజయుమో) జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నవీపేటకు చెందిన భాను గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భాను గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన పదవిని బాధ్యతగా స్వీకరించి, పార్టీ పటిష్ఠతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, మండల అధ్యక్షుడు సరిన్‌లకు భాను గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.