

చిన్నారులకు చిన్న వయస్సు నుంచే పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం ప్రతి చిన్నారికి సక్రమంగా అందేలా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. గర్భిణీలు, బాలింతలకు అందించే పోషకాహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ద్యాగ సరిన్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వైద్యులు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


