
శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించిన మంత్రి పొన్నం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంట నడిచిన మంత్రి పొన్నం ప్రభాకర్
మంచిర్యాల: తెలుగు కే న్యూస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకావడానికి వెళ్తుండగా, కొత్తపల్లి వద్ద రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి ఆత్మీయంగా ఆహ్వానించిన మంత్రి పొన్నం, అనంతరం ఉప ముఖ్యమంత్రి వెంట కలిసి కార్యక్రమాలకు బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. కొత్తపల్లి ప్రాంతం కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో మార్మోగింది. భట్టి విక్రమార్క రాకతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మంచిర్యాల జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కలిసి కనిపించడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. “అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సేవే ధ్యేయం” అంటూ భట్టి విక్రమార్క పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి.








