
హైదరాబాద్, జూన్ 13: ఖమ్మం జిల్లాలో అత్యాచారయత్నానికి గురైన బాలిక ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించనున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.





