ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – కల్వకుంట్ల కవిత

ఆదిలాబాద్ జిల్లా తెలుగు కె న్యూస్  ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం మాట్లాడుతూ, ఇంద్రవెల్లి పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఆదివాసీ అమరవీరుల త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆదివాసీ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన అమరవీరుల స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకమని అన్నారు.
ఆదివాసీ సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.