MRPS చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జ్ గాజులపల్లి రమణ మృతికి ఘన నివాళి!

కె24 న్యూస్ తెలుగు జూన్ 25. MRPS-MSP చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జ్ గాజులపల్లి రమణ అకాల మరణం పట్ల ఆ దళిత సంఘం నేతలు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో అంత్యక్రియల నిర్వహణకు MRPS-MSP నాయకులు సహాయ సహకారాలు అందించారు. సామాజిక న్యాయం కోసం, దళిత–బహుజన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన రమణ గారి మరణం ఉద్యమానికి తీరని లోటు. వారి సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఈ సందర్బంగా MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం పి ప్రకాష్ కొనియాడారు. రమణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని MRPS నాయకులు భగవంతుడిని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పి. వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, గోవిందప్ప మాదిగ, రవీంద్ర మాదిగ, జయప్ప మాదిగ పలువురు దళిత నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.