
నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి సిపిఎం డిమాండ్.
……………………….. ఈరోజు………………
సిపిఎం పార్టీ ఆధ్వర్యం ppలో నవీపేట్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బందితో మరియు స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్లో సౌకర్యాలను పెంచితే మరింతమంది పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అందుకొరకు 50 పడకల ఆసుపత్రిగా దీనిని ఏర్పాటు చేయాలని సౌకర్యాలను పెంచాలని వైద్యుల సంఖ్యను పెంచాలని మహిళల ప్రసవాల కొరకు ప్రైవేట్ హాస్పటల్కు జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపకుండా స్థానికంగానే ప్రసవాలను పెంచితే ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుండి పాముకాటుతో, కుక్క కాటుతో వచ్చిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్సవం అందించడానికి రాబిన్ వ్యాక్సిన్ ,లతో పాటు. పాము కాటు వ్యాక్సిన్ అందు బాటు లో ఉంచాలని ఆపరేషన్ సెంటర్లను మెరుగుపరచాలని తగినంత వైద్య సిబ్బంది జరిగితే మరింత ప్రజలకు మెరుగైన వైద్యం అందటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు విద్య వైద్యం అనేది పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ సంస్థల్లో ఖరీదు తో ఉందని, అందువల్ల ప్రభుత్వమే మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ ,నాయకులు దేవేందర్ సింగ్ , మహబూబ్, శంషు, సావిత్రి , గౌతమ్,వసంత్ తదితరులు పాల్గొన్నారు.


