పెద్దమిట్టపల్లిలో శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీలో ఆధ్వర్యంలో అన్నదానం!

 

కె24 న్యూస్ తెలుగు జూన్ 27.  చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి మనిషిలోని మానవత్వాన్ని చాటిచెబుతున్నాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రతి శనివారం యోగా, ధ్యానంతో పాటు అన్నదానం చేపట్టడం ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో బండి పట్టాభిరెడ్డి, ఇ.సుబ్బారెడ్డి, త్యాగరాజుల రెడ్డి, విజయ, బండి మాధవిలత, బాబు రెడ్డి, బండి దామోదర్ రెడ్డి పాల్గొని అన్నదానం నిర్వహించారు. దాత ఇ.రఘునాథరెడ్డి సహకారంతో జరిగిన ఈ అన్నదానం పేదలకు గొప్ప అండగా నిలిచింది. ఈ సందర్బంగా ఆశ్రమ కృషి నిజంగా స్ఫూర్తిదాయకం, సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరంమని అయన అన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.