ముదారం భూ వివాదం: దళితుల హక్కుల కోసం పోరాటం!

కె24న్యూస్ తెలుగు జూన్ 29. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ముదారం గ్రామంలోని సర్వే నంబర్లు 390/1, 390/2, 390/7 భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న స్థానిక ఎస్సీ (మాదిగ) కుటుంబాలకు అన్యాయం జరగడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. స్థానికుల హక్కులను విస్మరించి, ఇతర మండలం వారికి పట్టాలు ఇవ్వడం అధికారుల పక్షపాతానికి నిదర్శనమని MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపి ప్రకాష్ అన్నారు. కుప్పం డెవలప్మెంట్ ఆఫీసర్‌కు వినతిపత్రం సమర్పించిన దళిత సంఘ నాయకులు మరియు గ్రామస్థులు, ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పట్టాలను రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. దళితుల కడుపు కొడితే ఊరుకునేది లేదని, న్యాయం జరగని పక్షంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.