మలేరియా, డెంగ్యూ నివారణకు అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా: తెలుగు కే న్యూస్ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వాహక వ్యాధుల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వ్యాధుల నివారణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించడం, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేసి, లార్వా నిర్మూలన, ఆరోగ్య శిబిరాలు, రక్త పరీక్షలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతోనే వాహక వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, డీఎంహెచ్‌వో తదితర అధికారులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.