కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సీనియర్ కార్యకర్తల రాజీనామా

తెలుగు కే న్యూస్ గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు అరుకాల శ్యామ్‌కుమార్, పోలవేని మల్లేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్‌కు రాజీనామా లేఖను అందజేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొందరికే అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.