
తెలుగు కే న్యూస్ PS. పెరుకలగడ్డ: పాఠశాలలో “మన శరీర వ్యవస్థలు” అనే సైన్స్ అంశంపై విద్యార్థులు వినూత్న ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్టెతస్కోప్ సహాయంతో హృదయ స్పందనను ప్రత్యక్షంగా వినే ప్రయోగాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఒక్కొక్కరుగా పాల్గొని గుండె స్పందన, దాని లయను పరిశీలిస్తూ హృదయం పనితీరును అర్థం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హృదయం శరీరంలో నిర్వహించే కీలక విధులు, రక్త ప్రసరణ వ్యవస్థ, సాధారణ హృదయ స్పందన రేటు వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించిన విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకుంటూ శాస్త్రీయ విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకున్నారు.
ఇలాంటి ప్రాజెక్టు ఆధారిత బోధన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, సైన్స్ పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.


