
కామారెడ్డి జిల్లా | K24 న్యూస్ తెలుగు
ఫీజు రీయాంబర్స్మెంట్‌ను పాత విధానంలోనే అమలు చేయాలని, పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించగా, ప్రభుత్వ కళాశాలల్లోనూ నిరసనలు నిర్వహించారు.
జీఓ-9ను వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు వినోద్ నాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


