గన్నేరువరం ప్రజల దశాబ్దాల కల సాకారం

రూ. 77 కోట్లతో మానేరు వాగుపై మహా బ్రిడ్జికి జూలై 6న శంకుస్థాపన

గన్నేరువరం మండల తెలుగు కే న్యూస్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. మానేరు వాగుపై రూ.77 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భారీ బ్రిడ్జికి జూలై 6న శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకానున్నారు.
మానేరు ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గన్నేరువరం నుంచి కరీంనగర్ చేరుకోవడానికి సుమారు 40 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త బ్రిడ్జి నిర్మాణంతో గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజలకు కరీంనగర్ చేరుకోవడం సులభం కానుంది. రవాణాతో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలకు కూడా ఊతం లభించనుంది.
బ్రిడ్జి నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన సాయి పావని కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.