నిజామాబాద్ జిల్లా,డొంకేశ్వర్ మండలంలోని :-అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి ఏజెంట్లను కలిసి SIR ఓటరు నమోదు ప్రక్రియను ప్రజలకు చేరవేసి, అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయించాలని సూచించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ స్థాయి ఏజెంట్లకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగుల బాపూరావు, మండల పర్యవేక్షకులు బార్ల భరత్ రెడ్డి, దశా గౌడ్, మోతే చిన్న సాయన్న, గ్రామ సర్పంచ్ డాక్టర్ భూమన్న, గడ్చంద రాజు, అకోలా సాగర్ తదితర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Post Views:153
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.