కుప్పంలో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన అందరూ ఆహ్వానితులే!

కె24న్యూస్ తెలుగు జూలై 08. భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి అలుపెరుగని పోరాట పటిమను, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను ప్రతిబింబించే సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శనను చందన క్రియేషన్స్, హైదరాబాద్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. 09-07-2026 సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ అద్భుత ప్రదర్శన జరగనుంది. బాబాసాహెబ్ ఆశయాలను గౌరవించే యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై, సామాజిక చైతన్యాన్ని రగిలించే ఈ చారిత్రాత్మక నాటకాన్ని తిలకించాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.