తొండకూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకుల అభినందనలు

నిజామాబాద్ జిల్లా, డొంకేశ్వర్ మండలం తొండకూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన జంగం ప్రశాంత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరై ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లారు గంగాధర్, ఉప సర్పంచ్ మజారుద్దీన్, డీసీసీ జనరల్ సెక్రటరీ దేగం గంగారెడ్డి, డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగుల బాపూరావు, సీనియర్ నాయకులు దశ గౌడ్, వై. గంగాధర్, సాయన్న, ఎస్.కె. ఫరీద్ తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని నాయకులు పేర్కొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.