తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి మృతి తీరనిలోటు

నిజామాబాద్ జిల్లా, మెండోరా గ్రామం, జులై 10 తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా గ్రామంలో గురువారం రోజు సాయంత్రం దాసరి మూర్తి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మెండోరాలో తన స్వగృహంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు, వారి మృతి యావత్ తెలంగాణ బిసి సంక్షేమ సంఘం తీరని లోటు దాసరి మూర్తి బీసీలకు చేసిన సేవలు మాటల్లో చెప్పలేనిది, వారు ప్రతినిత్యం బీసీల సంక్షేమం కోసం బీసీల ఐక్యమత్యత బీసీల రాజ్యాధికారం బీసీల రిజర్వేషన్ల కోసం తన అలుపెరుగని పోరాటం చేస్తూ జీవిస్తూ బీసీలను ఐక్యమత్యం చేస్తూ వచ్చారు, బుధవారం రోజున ప్రెస్ మీట్ లో పేద విద్యార్థుల
పీజు రియాంబర్షుమెంట్ వెంటనే విడుదల చేయాలి, తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం దాసరి మూర్తి డిమాండ్ చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే మనస్తత్వం అయినది, ఆయన జీవిత ఆశయం బీసీలకు రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ల కోసం ఎల్లప్పుడు మాట్లాడుతూ, ఉండేవారు. దాసరి మూర్తి మనస్తత్వం ఎలాంటిదంటే తనకంటే చిన్నవాళ్లను కూడా ఎంతో ఆప్యాయంగా అన్నగారు లేక సార్ అని పిలుస్తూ బీసీల ఐక్యమత్యం కోసం కృషి చేశారు, ఈరోజు ఆయన లేని లోటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తీరనిలోటు తన సన్నిహితులు శోకసముద్రంతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి మూర్తి అంతిమక్రియలకు పాల్గొని ఘన నివాళులు అర్పించారు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు రమణ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాస శ్యామ్, మండల అధ్యక్షుడు మెండోరా మహేష్, స్టేట్ సెక్రెటరీ నారా గౌడ్, మీడియా జర్నలిస్ట్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.