

ఈ సందర్భంగా వడ్డె రవి మాట్లాడుతూ.. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, గ్రామ పెద్దలకు, కాలనీవాసులకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ప్రతి నెల రెండో శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరాజ్, జడల నరేష్, శ్రీకాంత్, మాణిక్యాల గోపి, సోనియా, శ్రీజ, రనిస్తో పాటు కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల రెండో శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఆసక్తి ఉన్న దాతలు, భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు.






