ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియపై ప్రజలు త్వరితగతిన స్పందించాలి: బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరిన్

నిజామాబాద్ జిల్లా,నవీపేట్:- ఓటు హక్కు పరిరక్షణలో భాగంగా ఎస్‌ఐఆర్ (SIR) నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నవీపేట్ మండలంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దర్యాపూర్ గ్రామంలోని 199, 200 పోలింగ్ బూత్‌ల పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏ-2లు, బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరిన్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పరిశీలనకు సమయం తక్కువగా ఉన్నందున ప్రజలు వెంటనే స్పందించి అవసరమైన ఫారమ్‌లను పూర్తి చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత గ్రామ బీఎల్‌ఓలకు అందజేయాలని కోరారు.
విదేశాల్లో ఉన్న ఓటర్లు, మరణించిన వారి వివరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు సమయానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక బీఎల్‌ఓలు లేదా మండల అధికారులను సంప్రదించాలని బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరిన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, బీఎల్‌ఏ-2లు, బీజేపీ మండల నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.