షాబాద్ ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

K 24 న్యూస్ తెలుగు షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సొంత మేనమామ గ్రామమైన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పిన్జర్ల గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా సంఘటనా స్థలానికి వచ్చిన రాజ్‌కుమార్ సోదరుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన సోదరుడి చర్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆగ్రహంతో స్పందించినట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు. కుటుంబ పరిస్థితులపై విచారం వ్యక్తం చేసిన ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు.
కాగా, షాబాద్ ఆరు హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడి ఆత్మహత్యతో ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.