ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్


కరీంనగర్ జిల్లా మానకొండూర్ K24 న్యూస్ తెలుగు నియోజకవర్గంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతేల్లి రాజేందర్ రెడ్డి మంగళవారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తీవ్ర గాయాలైన ఆయనను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అనుచరుడు మురళీధర్ రెడ్డి తన భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, ఆ మనస్తాపంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని బాధితుడి భార్య ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యేపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.