ప్రేమ వేధింపుల కేసులో ముగ్గురు అరెస్ట్

మంచిర్యాల జిల్లా, జూలై 14 (తెలుగు కే న్యూస్): జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక మాధవి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గోనె వెంకటేష్‌తో పాటు అతని తల్లి శంకరమ్మ, అక్క శైలజలను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసి, వెంకటేష్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో, యువతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధించి, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు వెంకటేష్ ఒప్పుకున్నాడని సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో తల్లి, అక్క కూడా ప్రోత్సహించినట్లు విచారణలో వెల్లడైంది. సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ వివరాలు, వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.