

వాహనాన్ని డాంగే రాజబాబు అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొలంలో బోల్తా పడింది. ఈ ఘటనలో సంజీవ్‌తో పాటు మరో నలుగురు కూలీలు గాయపడగా, స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కూలీలను పనికి తీసుకొచ్చిన కోస్లీ గ్రామానికి చెందిన కోరపల్లి సురేష్ ఫిర్యాదు మేరకు, బోలెరో డ్రైవర్ డాంగే రాజబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.








