బొత్తలగడ్డ వద్ద కాల్వలో తుంగ తొలగింపు.. డ్రైనేజీ నీటి ప్రవాహానికి మార్గం సుగమం

తెలుగు కే న్యూస్ రెండో వార్డు బొత్తలగడ్డ ప్రాంతంలో సైడ్ డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లకుండా కాల్వ మొత్తం తుంగతో మూసుకుపోవడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తుంగను తొలగించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ శ్రీ కోడారి సాంబరాజు, ఉప సర్పంచ్ యాట మధు, 2వ వార్డు సభ్యుడు గంగదారి యాదగిరి, 3వ వార్డు సభ్యురాలు వడ్లకొండ శ్రీలత, 7వ వార్డు సభ్యురాలు బైరు సుకన్యతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
కాల్వలో పేరుకుపోయిన తుంగను తొలగించడంతో డ్రైనేజీ నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు. స్థానికులు గ్రామపంచాయతీ చేపట్టిన చర్యలను అభినందించారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :