నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని :-యంచ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కారడి జలాబాయి (68) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బాసర–రహదారిపై బైక్ ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Post Views:41
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.