
కామారెడ్డి జిల్లా, K24 న్యూస్ తెలుగు:
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రొడ్డ రాజుతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు సర్టిఫికెట్లు, యూరియా నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన షబ్బీర్ అలీ మీ సేవ కేంద్రం ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అభివృద్ధి పనులకు కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారు.






