కామారెడ్డి కలెక్టరేట్‌లో జాతీయ రహదారుల భద్రతపై సమీక్ష

కామారెడ్డి, జూలై 21 (K24 న్యూస్): కామారెడ్డి కలెక్టరేట్‌లో జాతీయ రహదారుల భద్రత, సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ విక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్‌స్పాట్ల గుర్తింపు, హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్స్, క్రాష్ బ్యారియర్లు, అత్యవసర వైద్య సేవలు, భద్రతా మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సుప్రీంకోర్టు ఆదేశాలను సమయానికి అమలు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.