లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ 48వ ఇన్స్టాలేషన్ సెరెమొని కార్యక్రమం నిర్వహణ ఈ ఆర్ ఫౌండేషన్.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 23, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ 48వ ఇన్స్టాలేషన్ సెరెమొని కార్యక్రమానికి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ హాజరయ్యారు. ప్రెసిడెంట్ లయన్ రఫీ గౌహార్, సెక్రెటరీ అంబల్ల తిరుపతి, ట్రెజరర్ సుధీర్ బాబులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా ఈ ఆర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ మంచి పేరు సంపాదించుకుందన్నారు. ఎన్నో ఏళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కెవిఆర్, విట్టోబ శేఖర్, బ్యాంకు నవీన్, కర్తన్ నవీన్, సత్తన్న, శ్రీకాంత్ గౌడ్, వినోద్, దినేష్, ముఖేష్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.