
కామారెడ్డి జిల్లా, K24 న్యూస్ తెలుగు:
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అసలు యజమాని పేరుతో వేరే వ్యక్తిని నిలబెట్టి నకిలీ పత్రాలతో ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తన మామ సంగారెడ్డిని అసలు యజమానిగా నటింపజేసి రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించినట్లు గుర్తించారు.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. భూములు కొనుగోలు చేసే ముందు యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ చరిత్ర, రెవెన్యూ రికార్డులు తప్పనిసరిగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.







