జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ముకుందా రెడ్డి ఆధ్వర్యంలో 4000 ఈతముక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ భాగంగా కామరెడ్డి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు రాఘవపూర్ గ్రామంలో ముకుందరెడ్డి ఆధ్వర్యంలో 4000 ఈతమొక్కలు నాటడం జరిగింది ఇందులో కామారెడ్డి సొసైటీ నెంబర్ 1 గ్రూపు వారు 2000 చెట్లు సొసైటీ నెంబర్ 2 గ్రూపు వారు 2000 చెట్లు నాటడం జరిగింది ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని మరియు ఈత మొక్కలు తాటి మొక్కలు పర్యావరణానికి తోడ్పడడమే కాకుండా గీత కార్మికుల వృత్తికి జీవనోపాధి కూడా అందిస్తాయని ఆయన తెలిపారు అలాగే కామారెడ్డి ఏపీవో అన్నపూర్ణ మాట్లాడుతూ ఒక్కొక్క మొక్కపరిరక్షణ కోసం ఐదు రూపాయలు కేటాయిస్తారుఅందరూ తమ వంతు బాధ్యతగా మొక్కల సంరక్షణకు పాటుపడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినీల నరేష్ ట్రైనింగ్ ఏ ఈ ఏస్ అరుణ్ చంద్ర ఎక్సైజ్ సీఐ లు సంపత్ కృష్ణ ,సుందల్ సింగ్ ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్, రచన పంచాయతీ సెక్రెటరీ మాధవి లత గౌడ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, జీవన్ గౌడ్ ,చంద్ర గౌడ్, నారా గౌడ్, గోపి గౌడ్, శ్రీధర్ గౌడ్ ,రమేష్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జాన్ ,ఫరీద్ కానిస్టేబుల్స్ మునావర్ గోరి, పవన్, బాబు ,శరత్ ,దినేష్ అమృత్ రెడ్డి ,రాజు ,శంకర్ ,వందన ,శిరీష తదితరులు పాల్గొన్నారు

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.