తవణంపల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్!

కె 24 న్యూస్ తెలుగు జూలై 24. చిత్తూరు జిల్లా తవణంపల్లి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (PTM) అత్యంత ఉత్సాహంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటల పోటీలు అలరించాయి. ఉపాధ్యాయులు, సిఆర్పీ చిట్టి బాబు ఎస్ఎంసి సభ్యులు , తల్లిదండ్రులు కలిసి సహపంక్తి భోజనం చేయడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న చొరవను తల్లిదండ్రులు అభినందించారు.