ఏకలవ్య జయంతి సందర్భంగా హరీశ్ రావు శుభాకాంక్షలు

 

 

K24న్యూస్ ఏకలవ్య జయంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఏకలవ్యుడు గురుభక్తి, పట్టుదలకు ప్రతీక అని తెలియజేసారు.

కేసీఆర్ హయాంలో ఎరుకల కులస్తుల అభివృద్ధికి ఎంపవర్‌మెంట్ స్కీం, నాంచారమ్మ జాతరకు అధికారిక గుర్తింపు, నిజాంపేటలో ఎరుకల ఆత్మగౌరవ భవనం వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకలవ్య భవనాన్ని ప్రారంభించకపోవడం, ప్రత్యేక ఏకలవ్య సంస్థ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎరుకల సమాజం డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.