కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ యంచ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు

నిజామాబాద్ జిల్లా,యంచ, నవీపేట్ మండలం: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యంచ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, నైవేద్య సమర్పణ అనంతరం మహామంగళహారతి నిర్వహించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా, గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా యంచతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.